అర్ధరాత్రి అకాలవర్షం.. మామిడి రైతుకు అపర నష్టం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పరిసర ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం మామిడి రైతులకు తీవ్ర నష్టానికి గురిచేసింది. అసలే ఈ ఏడాది మామిడి పంట అంతంత మాత్రమే కాసింది. కొద్దిమేరకే ఉన్న పంట కాస్త రాత్రి అకాల వర్షంతో మామిడి పంట నేల రాలడంతో పెట్టుబడులుకూడ వెళ్లేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.