June26 | లెనిన్ తెర వెనుక ఏం జరుగుతోంది..?
June26 | లెనిన్ తెర వెనుక ఏం జరుగుతోంది..?
June26 | మరోసారి వాయిదా పడిన ‘లెనిన్’ రిలీజ్
‘పెద్ది’ కోసం పోస్ట్‌పోన్ చేశారనే ప్రచారం
సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సెటైర్లు
రీషూట్ల వెనుక అసలు కారణం ఏంటి?
అఖిల్ కెరీర్‌కు ‘లెనిన్’ ఎందుకు కీలకం?
June26 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్టర్. ఈ భారీ, క్రేజీ సినిమాని ఏ ముహుర్తాన స్టార్ట్ చేసారో కానీ.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మే 1న రావాల్సిన లెనిన్ జూన్ 26కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈసారి రావడం పక్కా అని ప్రకటించారు కానీ.. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. జులై 10న లెనిన్ రిలీజ్ అని కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే.. లెనిన్ పై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ.. ఏమైంది..?
June26 | పెద్ది కోసం లెనిన్..

లెనిన్ మూవీని మే1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన తర్వాత మెగా హీరో రామ్ చరణ్ పెద్ది సినిమాని ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో ఒక రోజు గ్యాప్ లో చరణ్ పెద్ది, అఖిల్ లెనిన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఆతర్వాత లెనిన్ టీమ్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి కారణం ఏంటంటే.. చరణ్ పెద్ది ఏప్రిల్ 30న వస్తుంది కాబట్టి.. చరణ్ తో అఖిల్ కి ఉన్న అనుబంధం కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నామని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
June26 | లెనిన్ పై మెగా ఫ్యాన్స్ సెటైర్లు..

ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది జూన్ 4 కు పోస్ట్ పోన్ అయ్యింది. లెనిన్ జూన్ 26న వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మరోసారి వాయిదాపడింది. జులై 10న లెనిన్ వస్తుందని నాగార్జున సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అయితే.. పెద్ది వస్తుంది కాబట్టి చరణ్ తో అనుబంధం కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నామని అన్నారు. తీరా చూస్తే.. ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. సినిమా కంటెంట్ రెడీ కాకుండా.. వాయిదాలు వేస్తూ పెద్ది కోసం పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పడం ఏంటి అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా.. ఈసారి పెద్ది కలెక్షన్స్ రావడం కోసం లెనిన్ వాయిదా వేస్తున్నామని ప్రకటిస్తారేమో అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.
June26 | అసలు ఏం జరిగింది..?

లెనిన్ సినిమా అఖిల్ కెరీర్ కి చాలా అంటే చాలా కీలకం. అందుకనే.. కంటెంట్ రెడీగానే ఉన్నప్పటికీ.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు. కొన్ని సీన్స్ రీషూట్లు చేస్తున్నారు. రీషూట్ అనగానే.. సినిమా బాగా రాలేదేమో అనుకుంటారు కానీ.. రీషూట్ చేస్తున్నారంటే.. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారని అర్ధం. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎడిట్ షూట్ దగ్గర స్వయంగా నాగార్జున కూర్చొని వర్క్ చేయిస్తున్నారని టాక్.. ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలి.. కొత్త అఖిల్ ని జనాలకు చూపించాలని నాగార్జున తపిస్తున్నారు. మరి.. లెనిన్ నాగ్ అండ్ అఖిల్ నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాలి.

click here to read వైరల్ గా ‘తెల్ల పోరి’ పాట.. దీవానాకు ఫ్రీ పబ్లిసిటీ !
