సత్యసాయి జిల్లాలో అలర్ట్

సత్యసాయి జిల్లాలో అలర్ట్
వాహనాలు, రైల్వే స్టేషన్ల ముమ్మర తనిఖీలు
జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర రాత్రి జరిగిన భారీ పేలుడు (massive blast) నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు (District Police Officers) ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా జిల్లాలోని ప్రధానమైన పట్టణ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు (checks) చేశారు. ముఖ్యంగా జిల్లా అంతటా గల బస్టాండ్లు, రైల్వేస్టేషన్స్, కర్ణాటక బోర్డర్ చెక్ పోస్టులు, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా పుట్టపర్తిలో సాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న కారణంగా దేశ, విదేశాలకు చెందిన వేల మంది భక్తులు విచ్చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు మరింత కట్టుదిట్టంగా చేశారు.
