కరీంనగర్ లో స్వచ్చతా హీ సేవా
కరీంనగర్ లో స్వచ్చతా హీ సేవా
కరీంనగర్, ఆంధ్రప్రభ: స్వచ్చతా హీ సేవా 2025 కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగరంలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ” ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్” నివాదంతో పరిశుభ్రత పనుల కార్యక్రమాన్ని ( శ్రమదానం) రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు.
చీపురు పట్టి మానేరు డ్యామ్ పరిసరాలు శుభ్రం చేశారు.

విద్యార్థులతో కలిసి మానేరు పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను స్వయంగా తొలగించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ,నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
