Viral Song | వైరల్ గా ‘తెల్ల పోరి’ పాట.. దీవానాకు ఫ్రీ పబ్లిసిటీ !
Viral Song | వైరల్ గా ‘తెల్ల పోరి’ పాట.. దీవానాకు ఫ్రీ పబ్లిసిటీ !
- వెరైటీ లిరిక్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్న సాంగ్
- జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న రొమాంటిక్ డ్రామా
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్, Viral Song : చిన్న సినిమాలకు సోషల్ మీడియా ఇప్పుడు పెద్ద బలంగా మారింది. ముఖ్యంగా పాటల్లో ఉండే క్యాచీ లిరిక్స్, ఫన్నీ వర్డ్స్, వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కసారిగా వైరల్ అయితే సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం ఖాయం. ప్రస్తుతం యువ హీరో హర్షిత్ రెడ్డి నటించిన ‘దీవానా’ చిత్రానికి చెందిన ‘తెల్ల పోరి’ పాట కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుంది. జూన్ 19 విడుదలకు సిద్ధమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లోని ‘తెల్ల పోరి’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా అమ్మాయి అందాన్ని వర్ణించేందుకు ఉపయోగించిన వెరైటీ పోలికలు, సరదా లిరిక్స్ నెటిజన్లను నవ్విస్తున్నాయి.
“తెల్ల పోరి నా తెల్ల పోరి.. బల్లి కంటే తెల్లగుంటది”, “మెత్త మెత్త బుగ్గలు.. పంది పిల్ల పెదవులు”, “బ్రష్ చేస్తున్న.. ఫ్లష్ చేస్తున్న.. ఆ పిల్ల మొఖమే తిరుగుతుంటది” వంటి లైన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మే 28న విడుదలైన ‘తెల్ల పోరి’ లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వయంగా స్వరపరచి, రాసి, ఆలపించిన ఈ పాటను చిత్రబృందం “ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్”గా ప్రచారం చేసింది. యువతను ఆకట్టుకునే సరదా సాహిత్యం, వినోదాత్మక చిత్రీకరణతో ఈ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది.
కొందరు ఈ లిరిక్స్‌ను ఫన్నీగా ఎంజాయ్ చేస్తుండగా, మరికొందరు ఇలాంటి పోలికలు ఇప్పటివరకు వినలేదంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా.. సినిమా ప్రమోషన్‌కు మాత్రం ఈ పాట బాగా ఉపయోగపడుతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సాంగ్‌కు మంచి రీచ్ రావడంతో ‘దీవానా’పై ఆసక్తి పెరిగింది. అంతకుముందు విడుదలైన ‘ఇది ప్రేమ.. ఇది ప్రేమ..’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘దీవానా’ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా స్మేహా మణిమేఘలై నటించగా, నరేష్ విజయ్ కృష్ణ, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు. అర్హా మీడియా, వి స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది.
