ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని జొన్నలు దగ్ధం..
ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ఇచ్చోడ మండలంలోని గుండి వాగు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి జొన్న పంట దగ్ధమైంది.
గ్రామానికి చెందిన రైతు నందులాల్ తన రెండున్నర ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి ఇంటికి తీసుకువచ్చి, తన కొట్టం వద్ద నిల్వ ఉంచాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో నిల్వ ఉంచిన జొన్న పంట పూర్తిగా కాలిపోయింది.
ఈ ఘటనలో సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. పంట పూర్తిగా దగ్ధం కావడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని రైతు నందులాల్ కోరారు.
