కూలర్‌కు నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్.. తండ్రి, కొడుకు మృతి
కూలర్‌కు నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్.. తండ్రి, కొడుకు మృతి
పెంబి, ఆంధ్రప్రభ:
కూలర్లో నీళ్లు పోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తండ్రి, కొడుకు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని కొరకంటి గ్రామపంచాయతీ పరిధిలోని కొరకంటి తండాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
పెంబి ఎస్సై హన్మాండ్లు తెలిపిన వివరాల ప్రకారం, కొరకంటి తండాలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో రాథోడ్ శ్రీనివాస్ భార్య రాథోడ్ సోనాబాయి ఇనుప కూలర్లో నీళ్లు పోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆమె కేకలు వేసింది.
ఆమె కేకలు విని రాథోడ్ అర్జున్ (56), ఆయన కుమారుడు రాథోడ్ శ్రీనివాస్ ఆమెను కాపాడేందుకు వచ్చారు. ఈ క్రమంలో కూలర్ కిందపడటంతో నీటిలో విద్యుత్ ప్రవహించి, వారిద్దరూ షాక్‌కు గురయ్యారు.
వారిని వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి రాథోడ్ అర్జున్, రాథోడ్ శ్రీనివాస్ మృతి చెందినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సోనాబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
రాథోడ్ అర్జున్ కుమారుడు రాథోడ్ సుభాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు.
