గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.

రైతులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఆంధ్రప్రభ విజయవాడ రూరల్ : విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులకు రూ.25,00,814ల డివిడెంట్లు మంజూరయ్యాయి. బుధవారం గొల్లపూడి పి.ఏ.సీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ సహకార సంఘాలు లాభాల్లో నడవడం హర్షణీయమన్నారు. రైతులకు డివిడెంట్లు ఇవ్వడం ద్వారా సహకార స్ఫూర్తి పెరుగుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. పి.ఏ.సీఎస్‌లను బలోపేతం చేసి రైతులకు మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నామని వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు వెన్నెముక లాంటివని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించిన రైతులను ఎమ్మెల్యే అభినందించారు. పి.ఏ.సీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఎరువుల విక్రయాలు పారదర్శకంగా జరుగుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు, (గాంధీ), పి.ఏ.సీఎస్ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply