ఆకట్టుకున్న స్కూల్ గేమ్స్ స్టాల్

ఆకట్టుకున్న స్కూల్ గేమ్స్ స్టాల్

విజయవాడ, ఆంధ్రప్రభ :జిల్లా విద్యా శాఖ,సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎడ్యుకేషన్ ఎక్స్ పో కార్యక్రమం గురువారం జరిగింది.ఇందులో ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్చరీ, సైక్లింగ్, ఫెన్సింగ్ క్రీడలతో పాటు 35 క్రీడాంశాలలో క్రీడా ఉపకరణాలను ప్రదర్శించారు.ప్రభుత్వ పాఠశాలల క్రీడా ప్రతిభా వివరాలను,వారు సాధించిన పతకాలు,జాతీయపోటీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల వివరాలను ప్రదర్శించారు.జిల్లా కలెక్టర్ లక్ష్మీష స్టాల్ నీ సందర్శించి క్రీడా ఉపకరణాలను పరిశీలించారు.

వివరాలు అడిగి తెలుసుకుని వాటి పనితీరుని స్వయం గా పరిశీలించారు.ప్రభుత్వ పాఠశాలల లో ఇటువంటి క్రీడలు తర్ఫీదు ఇవ్వడం ఉపకరణాలను సమకూర్చుకుని విద్యార్థులను జాతీయ క్రీడాకారులుగా తీర్చి దిద్దడం పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ను అభినందించారు.అదే విధం గత మూడు సంవత్సరాలుగా స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అవార్డ్ లు కూడా ఎన్టీఆర్ జిల్లా దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ. కార్యక్రమంలో జిల్లా విద్య శాఖాధికారి చంద్రకళ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి టి.శ్రీలత, , వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్ రాజేంద్ర కుమార్,ఎస్. రమేష్, ఎం వి ఎస్ ప్రసాద్,గోసాని లు పాల్గొన్నారు.

Leave a Reply