Gold Rates | పసిడి ప్రియులు.. తస్మాత్!
బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ
ఈ రోజు స్వల్పంగా పెరిగిన పసిడి రేట్లు
Gold Rates | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసుకునే వారు ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకుంటే మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.12,846, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,775 ధర పలుకుతుంది. కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలచే ప్రభావితమవుతాయి. నిన్నటి తో పోల్చితే 24క్యారెట్ల బంగారానికి రూ.71లు, 22 క్యారెట్లకు పసిడికి రూ.65లు పెరిగింది.
బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ..
బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్(31.10 గ్రాములు) బంగారం ధర 5,000 డాలర్ల (ఇండియన్ కరెన్సీ లో రూ.4,47,402.47) స్థాయికి చేరవచ్చని డబ్ల్యూజీసీ సీఈఓ డేవిడ్ టైట్ చెబుతున్నారు. గత అక్టోబరులో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 4,381 డాలర్ల ( ఇండియన్ కరెన్సీ లో రూ.3,92,014.04) వద్ద ఆల్‌టైం రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 4,150 డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో రూ.3,71,344.05) ధర పలుకుతుంది. రోజుల్లో ఈ పరుగు కొనసాగి, వచ్చే ఏడాదిలో 5,000 డాలర్ల మార్కును తాకవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభంలోకి కూరుకోవడంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుందని నిపుణుల అంచనా. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేయడం, జపాన్‌లో అధిక ద్రవ్యోల్బణం కూడా బులియన్ మార్కెట్‌కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం డబ్ల్యూజీసీ మాత్రమే కాదు, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు సైతం వచ్చే ఏడాది బంగారం ఒక ఔన్స్ ధర 5,000 డాలర్లకు చేరుతుందని అంచనాలు వేస్తున్నారు.
పది రోజుల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తేదీ 24కే 22కే
నవంబర్ 28, 2025 రూ.12,846 (+71) ₹11,775 (+65)
నవంబర్ 27, 2025 రూ.12,775 (-16) ₹11,710 (-15)
నవంబర్ 26, 2025 రూ.12,791 (+87) రూ.11,725 (+80)
నవంబర్ 25, 2025 రూ.12,704 (+191) రూ.11,645 (+175)
నవంబర్ 24, 2025 రూ.12,513 (-71) రూ.11,470 (-65)
నవంబర్ 23, 2025 రూ.12,584 (0) రూ.11,535 (0)
నవంబర్ 22, 2025 రూ.12,584 (+186) రూ.11,535 (+170)
నవంబర్ 21, 2025 రూ.12,398 (-28) రూ.11,365 (-25)
నవంబర్ 20, 2025 రూ.12,426 (-60) రూ.11,390 (-55)
నవంబర్ 19, 2025 రూ.12,486 (+120) రూ.11,445 (+110)

