VMC | ప్రతీ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి

VMC | ప్రతీ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి

వీఎంసీ సిబ్బంది అవగాహన

VMC | ఆంధ్రప్రభ, విజయవాడ (కార్పొరేషన్) : ప్రతీ ఫ్రైడే డ్రైడేగా నిర్వహించాల‌ని వీఎంసీ సిబ్బంది ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించారు. దోమల (Mosquitoes) వ్యాప్తి వ‌ల్ల కలిగే అన‌ర్థాల గురించి ఈ రోజు వీఎంసీ కాలనీ ప్రాంతాలలో వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కాల‌నీలో నీటి నిల్వలను శుభ్రం చేశారు. దోమలు పెరగకుండా యాంటి లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు ఖాళీ డబ్బాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు తెరలు వాడడం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చునని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బయోలజీస్ట్ కామేశ్వరరావు, శానిటరీ సూపర్‌వైజ‌ర్స్ బాలాజీ శ్రీనివాస మూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్ట‌ర్లు, మలేరియా సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పాల్గొన్నారు.

Leave a Reply