England vs India ODI | నేడు భారత్ – ఇంగ్లండ్ మ‌ధ్య మూడో వన్డే

మ. 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో విజయం కోసం ఇరు జట్ల పోరు

England vs India ODI | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. సిరీస్‌లో భాగంగా మూడో, చివరి వన్డే నేడు లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు 1-1తో సమంగా ఉండటంతో ఈ పోరు సిరీస్‌ నిర్ణయాత్మకంగా మారింది. గత మ్యాచ్‌లో ఎదురైన లోపాలను సరిదిద్దుకుని విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగనుంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్‌ ఉత్సాహంగా ఉంది.

భారత బ్యాటింగ్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లపై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి కీలక బ్యాటర్ల ప్రదర్శన జట్టు విజయానికి కీలకం కానుంది. ముఖ్యంగా రోహిత్‌ శర్మ ఫామ్‌పై అభిమానుల దృష్టి నెలకొంది. ఇంగ్లండ్‌ జట్టులో జో రూట్‌, బెన్‌ డకెట్‌, హ్యారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్‌ వంటి బ్యాటర్లపై ఆ జట్టు ఆధారపడుతోంది. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ ప్రదర్శన కూడా కీలకంగా మారనుంది.

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాతావరణం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలం. సమయం గడిచేకొద్ది పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిగటగా మారే అవకాశం ఉంటంతో తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం ప్రధానం. 2017 తర్వాత ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన జట్టు గెలవలేదు.

తుది జట్లు (అంచనా) ఇండియా: శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / హర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, బుమ్రా, గుర్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ.

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెథెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / సాకిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహమూద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.