Pak Protest | ఒక్క ఆధారం లేకుండానే మాపై ఆంక్ష‌లా… భార‌త్ పై పాక్ ఆగ్ర‌హం

ఇస్లామాబాద్ – టెర్ర‌రిస్ట్ దాడిలో త‌మ దేశ‌స్థుల పాలు పంచుకున్న‌ట్లు ఒక్క ఆధారం లేకుండా త‌మ‌పై దౌత్య‌ప‌ర‌మైన ఆంక్ష‌లు విధించాడాన్ని త‌ప్పు ప‌ట్టింది.. తాము కూడా ఉగ్ర‌వాద బాధితులేమ‌న‌ని గుర్తించ‌డంలో భార‌త్ విఫ‌ల‌మైంద‌ని ఆరోపించింది.. కాగా భారత్‌ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. సింధూ జలాల‌ను నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేయడం వంటి భారత్‌ వరుస కఠిన చర్యలను పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ తీవ్రంగా విమర్శించారు. భారత్ నిర్ణయాలు తీవ్రమైనవి, అనుచితమైనవిగా పేర్కొన్నారు.

భారత్‌లో జరిగిన ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌కు సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలను భారత్‌ సమర్పించలేద‌న్నారు. ఆధారాలను సేకరించడంలోనూ విఫలమైందని పేర్కొన్నారు. భారత్‌ ప్రకటనలు తీవ్రత లోపాన్ని ప్రతిబింబిస్తుందని దార్ అన్నారు. అంతేకాకుండా భారత్ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా పాకిస్తాన్‌పై నిందలు వేస్తుందని, ఉగ్రవాదులపై కోపాన్ని పాక్‌పై వెళ్లగక్కడం సముచితం కాదని అన్నారు. కేవలం ఆరోపణలు కాకుండా ఆధారాలు సమర్పించాలని ఇషాక్ దార్ కోరారు. భారత్‌ చర్యలకు పాకిస్తాన్ తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించడాన్ని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లెఘారీ.. నిర్లక్ష్య చర్య, చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.

Leave a Reply