బాపట్ల పోలీసులకు మరిన్ని సౌకర్యాలు..

పెట్రోల్ బంక్, క్యాంటీన్ ఏర్పాటుకు ఎస్పీ గ్రీన్ సిగ్నల్

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా ఏఆర్, ఎంటీ కార్యాలయాలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, కార్యాలయాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏఆర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ పెట్రోల్ బంక్‌కు అనువైన ప్రదేశాన్ని, అలాగే పోలీస్ సబ్సిడీ క్యాంటీన్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

అలాగే మహిళల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శక్తి రెస్ట్ రూమ్స్ ఫర్ ఉమెన్ బస్సును కూడా ఎస్పీ పరిశీలించి, అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. పోలీసు సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాపట్ల డిఎస్పి సిహెచ్ చంద్రమౌళి, ఏ ఆర్ డి ఎస్ పి మోయిన్, ఎడ్మిన్ ఆర్ ఐ మౌలిద్దీన్, ఎస్ బి సి ఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు.