పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైఎస్సార్సీపీ నిరసన..

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైఎస్సార్సీపీ నిరసన..

దివ్యాంగ నేతతో వ్యవహారంపై విమర్శలు

బాపట్ల, ఆంధ్రప్రభ : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్సీపి రాష్ట్ర వికలాంగుల సంఘం కార్యవర్గ సభ్యుడు, బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చల్లా రామయ్య మెడకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలియజేసిన ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనపై పలు దివ్యాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నిరసన తెలియజేయాలంటే వాహనాలకు తాడు కట్టి లాగడం వంటి ప్రతీకాత్మక చర్యలు చేయవచ్చని, కానీ వికలాంగుడి మెడకు తాడు కట్టి లాగడం అవమానకరమని ఖండించాయి. దివ్యాంగుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ పార్టీలు జాగ్రత్తలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులు కోరారు.

Leave a Reply