ప్రాణహిత నదిలో డిగ్రీ విద్యార్థి గల్లంతు
చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపెల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి పబ్బ అజయ్ గౌడ్ ప్రాణహిత నదిలో గల్లంతయ్యాడు.తెలిసిన వివరాల ప్రకారం, వెంచపెల్లి గ్రామానికి చెందిన అజయ్ తన స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు సమీపంలోని రాచర్ల గ్రామం వద్ద ప్రాణహిత నదికి వెళ్లాడు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు నదిలో మునిగి గల్లంతైనట్లు సమాచారం.సమాచారం అందుకున్న కోటపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక జాలర్ల సహాయంతో నదిలో అజయ్ కోసం వెతుకుతున్నారు.ఈ ఘటనతో వెంచపెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
