nagoba | నాగోబా జాతర దినదినాభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్ల నిధుల హామీ

నాగోబా జాతర దినదినాభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి రూ.20 కోట్ల నిధుల హామీ

nagoba | నాగోబా జాతర చారిత్రక ప్రస్థానం

దట్టమైన అడవిలో పుట్టిన ఆదివాసి ఆరాధన కేంద్రం

మేశ్రమ వంశీయుల పాత్ర – తరతరాల పూజా సంప్రదాయం

నాగోబా మహాపూజలు: అధికారికంగా ప్రారంభమైన జాతర

ఆలయ అభివృద్ధిలో జరిగిన మార్పులు, విస్తరణ

ప్రభుత్వ సహకారం లేకుండానే ఆలయ నిర్మాణం

2022లో పూర్తయిన నూతన నాగోబా ఆలయం

నాగోబా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి హామీ

రూ.20 కోట్ల నిధుల ప్రకటనపై భక్తుల్లో ఆనందం

నాగోబా జాతర – ఆదివాసి ఆత్మగౌరవానికి ప్రతీక

nagoba | ఆంధ్రప్రభ ఇంద్రవెల్లి 17,, అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ ఊరి సమీపాన దశాబ్దాల క్రితం దట్టమైన అడవిలో చిన్న పందిరి నీడలో ప్రారంభమైన ఆదివాసి జాతర క్రమేణా రూపాంతరం చెందుతూ వస్తోంది. నేటికీ అదే దృఢ సంకల్పంతో, వారి సనాతన సంప్రదాయాలను, ఆచారాలను కొనసాగిస్తూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జనవరి 18న నాగోబా మహాపూజలు, అధికారకంగా ప్రభుత్వాధికారుల సమక్షంలో 17వతారీకు అర్ధరాత్రి ప్రత్యేక హారతితో ఈ పూజ ప్రారంభం.

nagoba | ఆలయ ప్రస్థానం

nagoba
nagoba

నాటి నుంచి నేటి వరకు ఆలయంలో చాలా మార్పులు చేర్పులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులతోపాటు, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఇంకా పలురాష్ట్రాల్లో ఉన్న మె శ్రమ వఒశీయులు వారాల తరబడి చిన్న పెద్ద కుటుంబీకులతో ఇక్కడ మహాపూజలో హాజరై తమ మొక్కులు తీర్చుకుంటారు.
1942 కు ముందు అప్పటి మె శ్రమవంశీ పెద్ద మారాజి పటేల్ అడవిలో వెలసిన పుట్టకు మొక్కి పూజలు నిర్వహించేవారని వారి తర్వాతి తరాల వారు ఇప్పటికీ చెబుతూంటారు.. తర్వాత బాదు పటేల్ పందిరి నీడలో మొక్కులు తీర్చుకునేవారు.

nagoba | మేశ్రమ వంశస్థుల చందాలతో…

ఆయన తర్వాత ఆలయ పీఠాధిపతిగా మె శ్రమ దేవరావు పటేల్ 1942 లో నాగోబా కు చక్కటి పందిరి ఏర్పాటు చేశారు. ఆలయ పీఠాధిపతిగా మెస్రం దేవరావు పటేల్ 1960,1977 లో నాగోబాకు ఆలయం నిర్మించారు ఆ తర్వాత 1995లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన గోడం నగేష్ మెశ్రమ వంశస్థులు తమ వంతుగా కార్పస్ ఫండ్ గా రూ. 80,000/- చెల్లిస్తే, ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి రూ.4.80/- లక్షలు మంజూరు చేస్తామని తెలపడంతో మేశ్రమ వంశస్థులు చందాలు జమ చేసి అప్పటి ప్రభుత్వానికి చెల్లించారు.

nagoba
nagoba

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగోబాకు నూతన ఆలయం నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, మేశ్రమ వంశస్థులు ప్రభుత్వ నిధులు వద్దని, తమ వంశస్తుల డబ్బులతోనే గర్భాలయం నిర్మించుకుంటామని ఆలయ పీఠాధిపతి మేశ్రమ వెంకట్రావు ప్రకటించారు. ఆ వంశస్థులు ఐదు కోట్ల రూపాయల నిధులతో అద్భుతమైన నాగోబా ఆలయ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేశారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేశ్రమ వంశీయులు జాతరకు ఆహ్వానించగా, సీఎం రూ. 20 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఆనాటి చరిత్రతో నేటి వరకు నాగోబా దినదినాభివృద్ధి చెందుతూనే ఉండడం విశేషం.

nagoba
nagoba

click here for more

click here to read Temple | శ్రీకోదండ రామాలయం, పంచవటి కాలనీ, మణికొండ

Leave a Reply