బెల్లంపల్లిలో ఘనంగా మే డే వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పలు రైల్వే విభాగాల్లో శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం చైర్మన్ ఎస్. నాగరాజు, సెక్రటరీ జి. సాంబశివుడు లాల్ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశంలో రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కులను కాపాడిందన్నారు.

రైల్వే కార్మికుల సమస్యలను సంబంధిత శాఖ వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ కమిటీ సభ్యులు, రైల్వే కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply