ఎస్ఐఆర్ సర్వేకు ఓటర్లు సహకరించాలి

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని లక్ష్మీసాగర్ గ్రామంలో కొనసాగుతున్న ‘ఎస్ఐఆర్’ (SIR) ఓటర్ జాబితా ప్రత్యేక పరిశీలన, మ్యాపింగ్ ఇంటింటా సర్వే కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు నల్ల జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ పార్టీ తరపున బీఎల్ఏ (BLA)గా కడెం మండల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు స్థానిక బీఎల్ఓ (BLO) గోధుర గంగామణితో కలిసి లక్ష్మీసాగర్‌లో ఇంటింటికీ తిరిగి ఎస్ఐఆర్ ఓటర్ పరిశీలన మ్యాపింగ్ ఫారాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటర్లు తమ మ్యాపింగ్ ఫారాలను ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా నింపాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే ఓటర్లకు సహాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. మ్యాపింగ్ ఫారాలను త్వరగా పూర్తి చేసి, సంబంధిత గ్రామాల బీఎల్ఓలకు అందజేసి ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలను కోరారు.