మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి..

మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి..
- సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజా రామచంద్రం
మునుగోడు, ఆంధ్రప్రభ : మే 1న నిర్వహించనున్న 141వ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుజా రామచంద్రం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రపంచ కార్మికుల హక్కుల సాధన కోసం చికాగో ఉద్యమంలో కార్మికులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు.కార్మికుల హక్కుల రక్షణ కోసం అన్ని కార్మిక సంఘాలు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్న మతతత్వ బిజెపి పార్టీని గద్దె దించే వరకు అన్ని కార్మిక సంఘాలు ఏకం కావాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.బండమీది యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి చాపల శ్రీను, కార్యవర్గ సభ్యులు వనం వెంకన్న,మందుల పాండు,ఎం దయాకర్, ఈదులకంటి కైలాస్, గోసుకొండ లింగయ్య, ఏఐటియుసి మండల కార్యదర్శి బెల్లం శివయ్య,పరమేష్,శంకర్, ముంత నరసింహ, ఆనుగంటి నరసింహ, తాటికొండ సైదులు,బి ఎల్లయ్య,కొండ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
