గమ్మోసిస్ నివారణకు నెమటోజ్’ ఆవిష్కరించిన మంత్రి ,ఎమ్మెల్యే
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న గమ్మోసిస్ సమస్యకు పరిష్కారంగా సిగ్నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేక ఉత్పత్తి ‘నెమటోజ్’ ను ఆవిష్కరించడం చాలా అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర సిట్రస్ సదస్సుకు పాల్గొన్న సందర్భంగా సిగ్నోవా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను మంత్రి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ నిర్వహణ అధికారి (సీఓఓ) డాక్టర్ రాజేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. గమ్మోసిస్ వ్యాధి నల్గొండ ప్రాంతంలోని సిట్రస్ తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, రైతుల దిగుబడులు, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.
ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా నెమటోజ్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.సంస్థ వైస్ ప్రెసిడెంట్ (టెక్నికల్) డాక్టర్ డి.శామ్యూల్ స్పార్జన్ మాట్లాడుతూ, సిట్రస్ పంటలో గమ్మోసిస్‌తో పాటు సిట్రస్ క్యాంకర్, పౌడరీ మిల్డ్యూ, సిట్రస్ సిల్లా, మాంగు మైట్ వంటి సమస్యలు కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు.
రైతులకు కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాకుండా సంపూర్ణ పంట నిర్వహణ పరిష్కారాలను అందించడం సిగ్నోవా లక్ష్యమన్నారు.సిగ్నోవా సంస్థ నెమటోజ్‌తో పాటు న్యూట్రిసోల్ శ్రేణి,మంగ్ ప్లస్ సిట్రస్ స్పెషల్,అగ్రిమ్యాక్స్ సిట్రస్ స్పెషల్, ఎస్‌ఎన్++ వంటి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఇవి వ్యాధి నియంత్రణ, పురుగుల నివారణ, పోషక నిర్వహణ, మొక్కల పెరుగుదల దిగుబడి వృద్ధికి తోడ్పడతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.నల్గొండ సిట్రస్ రైతులకు సమగ్ర సాంకేతిక సహకారం అందిస్తూ, నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు సిగ్నోవా కట్టుబడి ఉందని సంస్థ అధికారులు వెల్లడించారు.
