చిన్నకాపర్తి చెరువులకు కాలువ నిర్మించాలని వినతి

ప్రభుత్వ విప్ వేముల వీరేశంను కలిసిన సర్పంచ్, రైతులు

చిట్యాల, ఆంధ్రప్రభ: పిలాయిపల్లి కాల్వ ద్వారా వచ్చే నీటిని పెద్దకాపర్తి పెద్ద చెరువు నుంచి చిన్నకాపర్తి గ్రామంలోని చెరువులకు తరలించేందుకు అవసరమైన కాలువ నిర్మించాలని కోరుతూ చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు సోమవారం నకిరేకల్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిశారు.

పిలాయిపల్లి కాల్వ నీరు చిన్నకాపర్తి గ్రామానికి చేరేలా కాలువ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

దీనిపై ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందించి, కాలువ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రఘుగౌడ్, చంద్రారెడ్డి, మెట్టు వెంకటేశం, బెల్లంకొండ కృష్ణయ్య, బెల్లంకొండ నరసింహ, జాన్, బెల్లంకొండ గోపాల్, బెల్లంకొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.