ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి..

ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి..
- పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; పెన్షనర్ల సమస్యల సాధనకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేరేడుచర్ల మండల అధ్యక్షుడు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పెన్షనర్ల భవనంలో నిర్వహించిన 16వ సామూహిక జన్మదిన వేడుకలలో మాట్లాడారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల బకాయిలు డిఏ, పిఆర్ సి అమలు చేయాలని, ఆరోగ్య కార్డులు మంజూరి చేయాలని డిమాండ్ చేశారు.
మొదట ఈనెల జన్మించిన ఉప్పల లక్ష్మారెడ్డి, బండారు కృష్ణయ్య లను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం సభ్యులు పోతుగంటి సత్యనారాయణ, పులిజాల వెంకట రమణ రావు, బి బుద్ధారెడ్డి, బొడ్డుపల్లి సుందరయ్య, వై లక్ష్మీకాంతమ్మ, పి థెరిసా, ఎన్ కృష్ణారావు, జయ సుందర్ రావు, ఎం వెంకటేశ్వర్లు, ఎస్ దేవ బిక్షం, పి జగన్నాథం, వి.శ్రీనివాస రావు,ఎస్ మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
