పాలకవర్గం సహకారంతో చిన్న పోర్ల అభివృద్ధికి కృషి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకువెళ్తాననిచిన్నపోర్ల సర్పంచ్ గాండ్ల నిఖిత ప్రశాంత్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లగ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు వార్డుల వారీగా పరిష్కరించుకుందామనిఅన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు పారదర్శకంగా మంజూరు చేద్దామని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామానికి నిధులు తీసుకుకోచ్చి గ్రామ రూపురేఖలు మారుస్తానని అన్నారు. వేసవికాలంలో తాగునీరు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశామని మంత్రి సహకారంతో 50 ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చామని లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకునే విధంగా చూడాలన్నారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని వారికి అందుబాటులో ఉండి సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానంచేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి మహ్మద్ రఫీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
