కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి
చిట్యాల, ఆంధ్రప్రభ : కార్యకర్తల కుటుంబాల కష్టసుఖాల్లో బిజెపి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందనిబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి , అన్నారు. గురువారం మండల కేంద్రంలో బుర్ర అరవింద్- భార్గవి కూతురు అనుష్క మొదటి పుట్టినరోజు వేడుకలకు కీర్తి రెడ్డి హాజరై చిన్నారి ని ఆశీర్వదించారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఎదిగి ఉన్నత స్థాయిలో రాణించాలని,ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, బీజేవైఎం నాయకులు గాలీఫ్, గజానాల రవీందర్, చింతల రాజేందర్, రాయిని శ్రీనివాస్, వల్లల ప్రవీణ్, కేంసారపు ప్రభాకర్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే బుర్ర అరవింద్ – భార్గవి కుమార్తె బుర్ర అనుష్కమొదటి పుట్టినరోజు వేడుకలో బి ఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, చిట్యాల గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యుడు తౌటం నవీన్ పాల్గొని ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాండ్రాల వీరస్వామి,కొత్తకొండ సతీష్, బుర్ర రాహుల్ పాల్గొన్నారు.
