AP| లారీని ఢీకొట్టిన కారు దగ్ధం…

ఒకరు సజీవదహనం..


AP|గుత్తి, జులై 30 (ఆంధ్రప్రభ) : గుత్తి మండల పరిధిలోని తొండపాడు గ్రామం సమీపంలో తెల్లవారుజామున లారీని వెనకవైపు నుండి కారు ఢీకొట్టడంతో ఒకరు సజీవదహనమయ్యారు. వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా బుడేగారి తండాకు చెందిన పాల్తే రవి నాయక్ (33) సజీవ దహనమయ్యారు.

అందులో ప్రయాణిస్తున్న ఎస్.రవి నాయక్, డి లక్ష్మణ్ నాయక్ ప్రమాదం జరిగిన వెంటనే వారు అక్కడి నుండి వెళ్లిపోయినట్లు మృతుని బంధువులు తెలిపారు. మృతుడు పాల్తే రవి నాయక్ కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నట్లు వారి బంధువులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.