సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో లబ్ధిదారికి చెక్కు అందజేత
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి ముతేన్న ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నాయకులు లబ్ధిదారికి అందజేశారు.
ఈ సందర్భంగా దాసరి ముతేన్న మాట్లాడుతూ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు అందించడం జరుగుతోందన్నారు.
లబ్ధిదారి మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు సహకరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు నూకల నర్సయ్య, రామచందర్ గౌడ్, ప్రతీప్, దీపక్, లింబాద్రి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
