ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

గొల్లపల్లి మండలంలో 82.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..

పంట పొలాలు నీటమునిగి, వాగులు పొంగిపొర్లుతున్నాయి

గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గొల్లపల్లి మండలంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పంట పొలాలు నీటమునగగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

మండలంలో అత్యధికంగా 82.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

మండలంలోని బొంకూరు, రాపల్లె గ్రామాల్లో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానిక అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

వర్షాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప వాగులు, వంకలు దాటవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.