పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం
నర్సంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రజానాయకుడు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రతో పాటు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజానాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో బీఆర్ఎస్ శ్రేణులు మరింత నిబద్ధతతో ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.
అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన నాయకులు, ఈ తీరని లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
