ప్రియుడి కోసం భర్తను వదిలి.. చివరకు సూట్‌కేసులో శవంగా..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన ఓ వివాహిత జీవితం విషాదాంతమైంది. ప్రియుడి కోసం భర్తను వదిలి వెళ్లిన మహిళ.. చివరకు సూట్‌కేసులో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. మృతురాలు చోటి కుమారిగా గుర్తించారు. రెండేళ్ల క్రితం ఆమె తన భర్తను వదిలి ప్రియుడితో కలిసి డామన్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఇద్దరూ అక్కడే నివసిస్తున్నట్లు సమాచారం.
అయితే తాజాగా ఓ సూట్‌కేసులో చోటి కుమారి మృతదేహం లభ్యమవడంతో కేసు మలుపు తిరిగింది. ఈ హత్య వెనుక ఆమె ప్రియుడి పాత్ర ఉందని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల అసలు కారణాలు ఏంటనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
