ధాన్యం తరలింపు ఎప్పుడు..?

ధాన్యం తరలింపు ఎప్పుడు..?

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి ద్వారా రైతులు దళారుల బారిన పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రఘునాథపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఏర్పాటు చేశారు. కానీ కేంద్రాలలో కాంటాలు వేసిన ధాన్యం తరలించక పోవడంతో బస్తాలు రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపు ఆలస్యంపై రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

-నిలిచిన కాంటాలు..
రఘునాథపల్లి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే వెయ్యికి పైగా ధాన్యం బస్తాలు కాంటాలు వేసి సిద్ధంగా ఉన్నప్పటికీ, లారీలు సమయానికి రాకపోవడంతో బస్తాలు పేరుకుపోయాయి. ఇప్పటివరకు ఒకటే లారి ధాన్యం తరలించబడగా, మిగిలిన ధాన్యం అలాగే నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో బయట ఉన్న ధాన్యం తడిసిపోతుందనే భయం రైతులను వెంటాడుతోంది.

-రైతుల ఆగ్రహం..
పంటను అమ్మేందుకు ఆశగా తెచ్చిన ధాన్యం రోజుల తరబడి కాంటాలు వేసిన ధాన్యం తరలించకపోవడం, మిగతా ధాన్యం కాంటాలు వేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-పట్టించుకోని అధికారులు..
కొనుగోలు సెంటర్లకు లారీలు వస్తలేవని అధికారులకు తెలిపినప్పటికి పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.