Ver-Rs-9-5-Lakh-Crore : సీబీఎన్ బిగ్ ప్లాన్ Andhra Prabha Top News
Ver-Rs-9-5-Lakh-Crore : సీబీఎన్ బిగ్ ప్లాన్ Andhra Prabha Top News
- అభివృద్ధికి కేరాఫ్ వీఈఆర్
- రూ.9.50 లక్షల కోట్లే టార్గెట్
- ప్రభుత్వం వాటా రూ.4లక్షల కో్ట్లు
- రూ.5.50 లక్షల కోట్లు ప్రైవేటు పెట్టుబడులు
- ఏఐ డేటా సెంటర్లు సహా
- అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం
- వీఈఆర్ సమీక్షలో సీఎం చంద్రబాబు
(ఆంధ్రప్రభ; అమరావతి )

Ver-Rs-9-5-Lakh-Crore : విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. వివిధ రంగాల్లో కీలక ప్రాజెక్టుల ద్వారా రూ. 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు చేపట్టాం, రూ. 3.50- 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు , ప్రైవేట్ రంగం నుంచి రూ. 5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ తచ బేసిటీ ప్రాజెక్ట్ యాంకర్ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖ రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వ ఆలోచిస్తోంది. సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ ప్రాజెక్టు లక్ష్యమని స్పష్టం సీఎం చంద్రబాబు సూచించారు. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని… ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేయాలని సీఎం సీబీఎన్ ఆదేశించారు.
ఏఐ డేటా సెంటర్ల ఎకో సిస్టం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ, మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకూ వీఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలని సీఎం సూచించారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించటం ద్వారా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని ఆయన స్పష్టం చేశారు.. నిధుల కన్వర్జెన్స్ ద్వారా వీఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని సీఎం సూచించారు. అవసరమైన మేరకు వీజీఎఫ్ స్కీంను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు సీఎస్ సాయి ప్రసాద్, ఆర్ధిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
