గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలి

గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలి

  • ఉచిత ఫుట్‌బాల్ శిక్షణ శిబిరం ప్రారంభం
  • ముఖ్య అతిధిగా పాల్గొన్న చైర్మన్ వినయ్ కుమార్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : క్రీడాకారులు ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ సూచించారు. ఆదివారం స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫాదర్ కొలంబో స్కూల్ మైదానంలో జనగాం జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, పీడీ ఫుట్‌బాల్ కోచ్ సింగ పురం మహేష్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఉచిత ఫుట్‌బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఫాదర్ కొలంబో స్కూల్ కరస్పాండెంట్ రేవ్ ఫా. వై. థామస్ కిరణ్ కుమార్ మాట్లాడు తూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, చెడు అలవాట్లు, వ్యసనాల నుండి దూరంగా ఉంచుతాయని పేర్కొన్నారు. నెలరోజుల పాటు జరుగనున్న ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం చైర్మన్ వినయ్ కుమార్, ఫాదర్ థామస్ కిరణ్ కుమార్‌లను కోచ్ సింగపురం మహేష్ శాలువాతో సన్మానించారు.