ఇందనపల్లికి ఇన్‌చార్జి రేంజర్ నియామకం

జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కు అదనపు బాధ్యతలు..

జన్నారం, ఆంధ్రప్రభ : కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్‌లో ఉన్న ఇందనపల్లి రేంజ్‌కు తాత్కాలిక ఇన్‌చార్జి రేంజర్‌గా జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాబా ఖాదర్ వలీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఈ మేరకు కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందనపల్లిలో ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణను మంగళవారం సస్పెండ్ చేయడంతో, ఆయన స్థానంలో బాబా ఖాదర్ వలీని తాత్కాలిక ఇన్‌చార్జి రేంజర్‌గా నియమించారు.

ఈ సందర్భంగా బాబా ఖాదర్ వలీ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తానన్నారు. అక్రమ కలప రవాణా, నరికివేతలను అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.