బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు క్షమాపణ చెప్పాలి – సీపీఎం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు క్షమాపణ చెప్పాలి – సీపీఎం
చిలుపూర్, ఆంధ్రప్రభ: ” బండి సంజయ్ కొడుకుపై నమోదైన ఫోక్సో కేసు విషయంలో కొడుకు చేసిన పనికి ఆయనకు ఏం సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు” అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలను సీపీఎం చిల్పూర్ మండల కార్యదర్శి సాదం రమేష్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల నాయకుల కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే రాజీనామా చేయాలని డిమాండ్ చేసే బీజేపీ, తమ ఎంపీ, కేంద్ర మంత్రి కొడుకుపై ఫోక్సో లాంటి తీవ్రమైన కేసు నమోదైతే సంబంధం లేదు అని తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు.
బండి సంజయ్ కేంద్ర మంత్రి దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. తన కుమారుడు చిన్నారిపై అత్యాచారం లాంటి ఆరోపణలు వస్తే, కనీసం నైతిక బాధ్యత వహించి విచారణకు సహకరించాలి. అంతేగానీ నాకు సంబంధం లేదు అంటే సరిపోతుందానన్నారు. బేటీ బచావో, బేటీ పడావో అని నినాదాలు ఇచ్చే బీజేపీ, తమ నేతల ఇంట్లోనే బేటీలకు రక్షణ లేకపోతే ఏం సమాధానం చెబుతుందన్నారు.
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి
ఫోక్సో కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రక్షణ, న్యాయ సహాయం అందించాలి. సంబంధం లేదు అని బాధ్యత నుండి తప్పించుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు క్షమాపణ చెప్పాలి. అధికారం అండ చూసుకుని నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం తప్పదు అని సాదం రమేష్ హెచ్చరించారు.
