Bjp l 13వ వార్డులో ప్రచారంలో దూసుకు వెళ్తున్న బిజెపి అభ్యర్థి పావని మల్లికార్జున్

Bjp l 13వ వార్డులో ప్రచారంలో దూసుకు వెళ్తున్న బిజెపి అభ్యర్థి పావని మల్లికార్జున్

తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న 13వ వార్డు బిజెపి అభ్యర్థి బాల్చేడ్ పావని మల్లికార్జున్

Bjp l మక్తల్ ,ఆంధ్రప్రభః మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాల్చేడ్ పావని మల్లికార్జున్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధిలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతున్నారు. బిజెపిని ఆదరించాలని కోరారు . గతంలో ఎన్నడూ జరగని రీతిలో అభివృద్ధి చేశామని అన్నారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని కోరారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటు సభ్యులు డీకే. అరుణమ్మ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మక్తల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.వార్డు పరిధిలోని ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. ఈసారి గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply