కలెక్టర్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ ధర్నా

కలెక్టర్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ ధర్నా
మార్కెట్ యార్డ్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో
మార్కెట్ యార్డ్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే మర్రి టీఆర్ఎస్ నేత నాగం
టిఆర్ఎస్ శ్రేణులు, నాయకులు
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేత మరి జనార్దన్ రెడ్డి టిఆర్ఎస్ నేత నాగం శశిధర్ రెడ్డి నాయకత్వంలో భారీ ఎత్తున నాయకులు పార్టీ కార్యకర్తలు శ్రేణులు సందర్శించారు మొక్కజొన్న రైతులకు మద్దతు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డు ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు వివరాలు ఇలా ఉన్నాయి. గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన మొక్కజొన్న కుప్పలను సంచులను పరిశీలించారు భారీగా ఉన్న వేలాది మొక్కజొన్న సంచులను నిల్వలను పరిశీలించారు. రైతులతో మరి జనార్దన్ రెడ్డి నాగం శశిధర్ రెడ్డి మాట్లాడారు రైతుల గోసలు ఆవేదనను అన్యాయాన్ని తమకు జరిగిన ఇబ్బందులను నాగం కు మరి జనార్దన్ రెడ్డికి వివారించారు.
అనంతరం నెలికొండ గేట్ వద్ద ప్రధాన రహదారిపై టిఆర్ఎస్ శ్రేణులు నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా నిర్వహించారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఆ సమయంలో ట్రాఫిక్కు స్తంభించింది వాహనాలన్నీ నిలిచిపోయాయి. అనంతరం కొద్దిసేపు తర్వాత మూడు ట్రాక్టర్లతో మొక్కజొన్నలను తీసుకొని వెళ్లి తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి డాక్టర్లను లోనికి తీసుకువెళ్లాలని ప్రయత్నించగా పోలీసులు ఆపివేశారు.
కొద్దిసేపటి తర్వాత కలెక్టర్ సిబ్బంది వచ్చి కలెక్టర్ తో మాట్లాడడానికి ప్రతినిధి బృందం రావాలని కోరగా టిఆర్ఎస్ బృందం వెళ్లి కలెక్టర్ తో మాట్లాడారు తడిసిన ధాన్యాన్ని కొనాలని తెచ్చిన పంటను కొనాలని రైతుకు నష్టం జరగకుండా న్యాయం చేయాలని దాదాపుగా 74 వేలకు పైగా ఉన్న కాంట అయినా మొత్తాన్ని కొనాలని ఇప్పుడున్న మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
వచ్చిన ధాన్యాన్ని అంతా తరలించాలని రైతుల తెచ్చే ధాన్యాన్ని ఎంత కొనాలని కోరారు. కలెక్టర్ మూడు రోజులలో మొత్తం ధాన్యాన్ని తరలించి మీరు చెప్పిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని తాను మార్కెట్ యార్డులోకి వెళ్లి పరిశీలించి తాను బాధ్యతగా వ్యవహరిస్తానని హామీ ఇవ్వడం వారు విరమించారు.
