Chandrababu | చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌

Chandrababu | చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌

ఈసారి వైసీపీకి డిపాజిట్లు కూడా రావు

Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

వైఎస్సార్సీపీ పాలనలో రాయలసీమలో హింసాత్మక ఘటనలు పెరిగాయని ఆరోపించిన మంత్రి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని కొనియాడారు.

ప్రతిపక్ష హోదా కూడా లేని వారు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. “రప్పా… రప్పా…” అని పిలిస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా? అని ప్రశ్నించిన మంత్రి, గత ప్రభుత్వ హయాంలో ఉన్న పరిశ్రమలనే రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆరోపించారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు రాయలసీమకు వస్తున్నాయని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి బీసీ జనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు.