MLA Naveen Yadav | సీఎంఆర్‌ఎఫ్‌తో లబ్ధిదారులకు ఊరట
ప్రభుత్వ సాయంపై లబ్ధిదారుల హర్షం
MLA Naveen Yadav | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా సుమారు 40 నుంచి 50 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
