సైబర్ జాగ్రుక్తా దివస్ సందర్భంగా అవగాహన కార్యక్రమం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సైబర్ జాగ్రుక్తా దివస్ సందర్భంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బెజ్జంకి గ్రామ పంచాయతీ ఆవరణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రజలకు ప్రస్తుత కాలంలో పెరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి వివరించారు. ముఖ్యంగా ఐపీఎల్ టికెట్ బుకింగ్ మోసాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు దొంగిలించే గుర్తింపు దోపిడి, లోన్ యాప్‌ల ద్వారా జరిగే వేధింపులు మరియు బ్లాక్‌మెయిలింగ్, చార్‌ధామ్ యాత్ర పేరుతో జరిగే ప్యాకేజ్ మోసాలపై ప్రత్యేకంగా చర్చించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని, తెలియని యాప్‌లు డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎసై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
