తిమ్మాపూర్‌లో పిచ్చికుక్క దాడి.. ముగ్గురికి గాయాలు

ధర్మపురి (ఆంధ్రప్రభ): మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం పిచ్చికుక్క దాడికి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. తిమ్మాపూర్‌కు చెందిన బీసగోని చంద్రయ్య, మొగిలిపాక చంద్రయ్య, బోండ్ల లక్ష్మణ్ లపై పిచ్చికుక్క దాడి చేసింది.
గాయపడిన వారిని చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడ్డ బీసగోని చంద్రయ్యను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దాడి చేసిన పిచ్చికుక్కను గ్రామ ప్రజలు కలసి చంపివేశారు. గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
