tvk | సంపూర్ణ మెజారిటీ నిరూపించాల్సిందేనన్న గవర్నర్

tvk | సంపూర్ణ మెజారిటీ నిరూపించాల్సిందేనన్న గవర్నర్

tvk | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ప్రభుత్వ ఏర్పాటులో కీలక అవరోధాన్ని ఎదుర్కొంటోంది. గవర్నర్ అనుమతి లేకపోవడంతో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి.

234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు విజయ్ ఇచ్చిన వివరణపై ఆయన సంతృప్తి చెందకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. సంపూర్ణ మెజారిటీ నిరూపించాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా మెజారిటీ సాధించేందుకు టీవీకే స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. మరోవైపు పరిస్థితులు హంగ్ అసెంబ్లీ వైపు దారితీస్తాయా? లేక AIADMK, DMKలకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు రాజకీయాల్లో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply