శోభాయమానంగా శ్రీరామనవమి…

శోభాయమానంగా శ్రీరామనవమి…

జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన నవమి పందిళ్లు.
స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొండా ఉమా.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : సెంట్రల్లో శోభాయమానంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్లోని 21 డివిజన్‌ల పరిధిలో ఉన్న శ్రీరామాలయాలలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ప్రత్యేక పూజలు, హోమాలు, మంగళవాయిద్యాల నడుమ వేడుకలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.స్థానిక64వ డివిజన్ కండ్రికలోని కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు హాజరై,టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్తో కలసి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ఘనంగా నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీలు సమన్వయంతో ఈ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహించడం ఆనందకరమని అన్నారు.శ్రీరామచంద్రుని ఆలయాలలో ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు, పానకం పంపిణీ చేయడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సేవా భావం ప్రతిబింబిస్తోందని, ఈ కార్యక్రమాలలో యువత, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు కె. రవికుమార్ వరలక్ష్మి, లబ్బ వైకుంటం దుర్గా,బత్తుల కొండా కామేశ్వరి,ఆకుల సూర్యప్రకాష్, రాజానా బంగారు నాయుడు,పిరియా సోమేశ్వరర్రావు,జలకం రాజారావు, పైడి శ్రీను, బుదాల సురేష్, కంచేటి నాగరాజు,కోలా శ్రీను, డిడి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply