పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
- జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచాలని కృష్ణాజిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. బుధవారం మచిలీపట్నం నగరంలోని మున్సిపల్ మెయిన్ పార్క్ వెనుక స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్లు గుర్తించి స్వర్ణాంధ్ర – స్వచ్చాoద్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా స్వచ్చ కార్యక్రమాలను మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

