Annamalai Politics | తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు

Annamalai Politics | తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు

అన్నామలై రాజీనామా..

Annamalai Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమర్పించినట్లు సమాచారం.

ఐదు పేజీల రాజీనామా లేఖను సమర్పించిన అన్నామలై, తన నిర్ణయానికి గల కారణాలను అందులో వివరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నామలై రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించినట్లు సమాచారం.

తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగిన అన్నామలై రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్నామలై తర్వాతి అడుగు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక మరే రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అన్న దానిపై తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.