Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Stock Market | లాభాల్లో ముగిసిన మార్కెట్లు
నష్టాలకు బ్రేక్..
Stock Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు నష్టాల బాట నుంచి బయటపడ్డాయి. వరుసగా నాలుగు సెషన్ల పాటు నష్టాల్లో సాగిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. జూన్ 2న సెన్సెక్స్ 383 పాయింట్లు పెరిగి, నిఫ్టీ 23,483.55 స్థాయికి సమీపంలో ముగిసింది.
ఉదయం ట్రేడింగ్‌లో మార్కెట్లు ఒత్తిడికి లోనైనా, తర్వాత ఐటీ రంగం షేర్లలో వచ్చిన రికవరీ సూచీలకు ఊతమిచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి ప్రధాన ఐటీ షేర్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
అయితే మంగళవారం ఐటీ షేర్ల ర్యాలీతో మార్కెట్లకు కొంత ఊరట లభించింది. నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడటంతో ఇన్వెస్టర్లలో కొంత సానుకూల వాతావరణం కనిపించింది. అయినప్పటికీ గ్లోబల్ టెన్షన్లు, ముడి చమురు ధరలు, విదేశీ మదుపర్ల అమ్మకాలపై మార్కెట్ వర్గాలు ఇంకా అప్రమత్తంగా ఉన్నాయి.
