సేవలకు గుర్తింపు..అవార్డులు ఇచ్చిన గవర్నర్.

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : వివిధ మార్గాల్లో విశేష సేవలు అందించిన ఇద్దరు వ్యక్తులకు విశిష్ట గుర్తింపు లభించింది. గత ఐదు సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తదాతలను ప్రోత్సహిస్తూ చేసిన సేవలకు గుర్తింపుగా ఆదివారం ప్రపంచ రక్తధాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమములో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర అవార్డును అందుకున్నారు. అలాగే అత్యధికసార్లు రక్తదానం చేసిన పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన కడమంచి శివకు రాష్ట్ర అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ సెక్రటరీ శ్రీ దాన కిషోర్, డీఐజీ మహేష్, సీఈఓ, సెక్రటరీ రాములు, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, తదితరులు పాల్గొనారు.

Leave a Reply