కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

  • ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ధర్మపురి, ఆంధ్రప్రభ: మహిళలతో పాటు కిషోర బాలికలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని నక్కలపేట ఇందిరమ్మ కాలనీ బస్తీ దవాఖానలో మే 18 నుండి మే 23 వరకు నిర్వహించనున్న “కిషోర బాలికల ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని” సోమవారం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. 11 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికల ఆరోగ్య పరిరక్షణ, వారిలో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు సాగే ఈ శిబిరంలో బాలికలకు ఉచితంగా రక్తహీనత (Anemia), మధుమేహం (Diabetes), బాడీ మాస్ ఇండెక్స్ (BMI) పరీక్షలు చేయడంతో పాటు, బహిష్టు సమయ పరిశుభ్రత (Menstrual Hygiene)పై వైద్య నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాలికల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన వైద్య సలహాలు అందించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ విరవేణి నాగలక్ష్మి, నేరెళ్ల మెడికల్ ఆఫీసర్ శివకుమారి, ఆర్‌బీఎస్‌కే (RBSK) మెడికల్ ఆఫీసర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, స్థానిక అధికారులు, ఆశా కార్యకర్తలు, హెల్త్ సూపర్‌వైజర్లు, మహిళా సంఘాల ఆర్‌పీలు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply