ధరలను నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలం..

ధరలను నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలం..

  • పెద్దపల్లి కలెక్టరేట్ ముందు సిపిఐ ఆందోళన.

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : అధిక ధరలను నియంత్రించడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ఆరోపించారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీజేపీ పాలనలో సామాన్యుడి బతుకు భారంగా మారిందన్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పప్పులు, నూనెలు, కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పేర్కొన్నారు.

అచ్చేదిన్ వస్తాయని చెప్పి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పెడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయతీలు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం సామాన్యులపై మాత్రం పన్నుల భారం వేస్తూ ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆదాయాలు పెరగడం లేదు కానీ ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం నిరుద్యోగం పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని, ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఆరోపించారు.

అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోశిక మోహన్, కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, కే. కనకరాజు, తాళ్లపల్లి మల్లయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, మడికొండ ఓదెమ్మ, తాళ్లపల్లి లక్ష్మణ్, కౌన్సిల్ సభ్యులు పూసాల రమేష్, రమ, కందుకూరి రాజారత్నం, అంజి, మాటాడి శంకర్, ఆరెపల్లి మానస్ కుమార్, కల్లేపల్లి నవీన్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, తిరుమల, అజ్మీర్ కరీం, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.