ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటో ప్రయాణం

సామాన్యుడిలా ప్రజల మధ్యలో కేంద్ర మంత్రి

ఆసక్తిగా గమనించిన స్థానికులు

చిగురుమామిడి, (ఆంధ్రప్రభ): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన ఆటోలోనే ప్రయాణిస్తూ చిగురుమామిడికి వెళ్లారు.

రేకొండ గ్రామం నుంచి చిగురుమామిడి వరకు సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించిన కేంద్ర మంత్రిని చూసి స్థానికులు ఆసక్తిగా గమనించారు. రోడ్డు వెంట పలువురు ప్రజలు ఆయనకు అభివాదం చేస్తూ స్వాగతం పలికారు.

ప్రజలకు మరింత చేరువగా ఉండే ప్రయత్నంలో భాగంగానే బండి సంజయ్ ఈ విధంగా ఆటో ప్రయాణం చేసినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఆయన నిరాడంబరతపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.